Site icon NTV Telugu

Hit 3: నాని సినిమా షూటింగ్‌లో విషాదం

Krishna Kr Died

Krishna Kr Died

జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ‘హిట్ 3’ షూటింగ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సినిమా షూట్ లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కె.ఆర్. కృష్ణ(30) గుండెపోటుతో మృతి చెందింది. చిత్రబృందం కాశ్మీర్‌లో ఉండగా, కృష్ణ ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా, ఆ చికిత్స విఫలమై మరణించినట్టు సమాచారం. టాలీవుడ్ హీరో నాని నటిస్తున్న థ్రిల్లర్ హిట్ 3 కోసం చిత్ర బృందం కాశ్మీర్ వెళ్ళింది. కృష్ణ డిసెంబర్ 23న అస్వస్థతకు గురికావడంతో శ్రీనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌తో ఆమె చికిత్స పొందుతుతోంది. కృష్ణ కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఏమైందో ఏమో సోమవారం గుండెపోటుతో మృతి చెందింది. ఇప్పుడు కృష్ణ కెఆర్ అనే యువ మహిళా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌ను కోల్పోవడం మొత్తం టీమ్‌నే కాకుండా చిత్ర పరిశ్రమను కూడా తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Naga Vamsi : నాగవంశీపై స్కామ్ 1992 డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

కృష్ణ కెఆర్ హిట్ 3 చిత్రానికి సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వరుగీస్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆమెను సోమవారం ఉదయం జనరల్ వార్డుకు తరలించాలని అనుకున్నారు అయితే ఈ లోపే గుండెపోటుతో మరణించింది. కృష్ణ భౌతికకాయానికి ఆమె స్వస్థలం కేరళలోని పెరుంబవూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ ఘటనపై సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో హిట్ ఫ్రాంచైజీ అనేది ఓ సూపర్ హిట్ ఫ్రాంచైజీ . హిట్, హిట్ 2 సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు హిట్ 3 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. కాశ్మీర్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు.

Exit mobile version