విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా తన 7వ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రానికి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే బ్యూటీఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అర్జున పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు విద్యా సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ మాస్ చిత్రాలతో అలరించిన విశ్వక్ సేన్ ఇప్పుడు క్లాస్ టైటిల్ తో రావడం విశేషం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నిన్న ప్రారంభమైంది. ఇక గతంలో ‘ఫలక్ నుమా దాస్, హిట్’ చిత్రాలతో హిట్లు తన ఖాతాలో వేసుకున్న విశ్వక్ ప్రస్తుతం ‘పాగల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించబోయే ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని దిల్ రాజు సమర్పించారు లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రం 1 మే 2021 న థియేటర్లలో విడుదల కానుంది
Also Read
- Tags
- Arjun
- Vishwak Sen
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?