Site icon NTV Telugu

అశోక్ గల్లా మూవీ అప్డేట్… త్వరలోనే టైటిల్ టీజర్

Ashok Galla's Debut title teaser to be out on June 23rd

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా పెద్ద కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అశోక్ గల్లా తల్లి, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి గల్లా అమర రాజా మీడియా & ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో తన కొడుకు తొలి సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

Also Read : కార్తికేయ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్…!

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను జూన్ 23న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయాన్నీ ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో అశోక్ లుక్ చూస్తుంటే… మహేష్ ‘టక్కరి దొంగ’ లుక్ గుర్తుకు వస్తోంది. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో సుధీర్ బాబు మొదటినుంచీ విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. మరి అశోక్ తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Exit mobile version