Site icon NTV Telugu

Arjun Chakravarthy : నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్య కథే ‘అర్జున్ చక్రవర్తి’

Arjun

Arjun

విజయరామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీని గుబ్బల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. క్రియేటివ్ గా ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు కొన్ని కథలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపిస్తున్నంత సీరియస్ గా ఇప్పటివరకు సినిమా రాలేదు. కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అవుతుందని చాలెంజ్ గా తీసుకుని సినిమా చేశాం. నల్గొండలో కబడ్డీ ప్లేయర్ నాగులయ్య. అతనిని అర్జున్ అని కూడా పిలుస్తారు. ఆయన అద్భుతమైన ప్లేయర్. ఆయన జీవితంలో ట్రూ ఈవెంట్స్ 60 %, 40% ఫిక్షన్ తో ఈ కథని చేయడం జరిగింది. సినిమా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది.

Also Read : పార్లమెంట్ లో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పై జేపీసీ సమావేశం!

ఈ కథ అలాంటిది.హీరోకి నాలుగైదు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. అన్ని మెయిన్ క్యారెక్టర్స్ కి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ కి ట్రాన్స్ఫర్మేషన్ 9 నెలలు పట్టేది. ఈ సినిమా కథపరంగా హీరో క్యారెక్టర్ కి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. దానికోసం చాలా సమయాన్ని కేటాయించాలి. అంతా సమయం కేటాయించే వీలు అందరికీ ఉండదు. అలాగే సినిమాని అథెంటిక్ గా తీసి ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లాలని మేము భావించాం. ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శిస్తున్నప్పుడు అందరూ చాలా అభినందించారు. ఓటీటీ వారు బిజినెస్ కి రీచ్ అవుట్ అవుతున్నారు. అయితే నా ఫోకస్ ప్రమోషన్స్ మీద ఉంది. కంటెంట్ ని నమ్ముకున్నాను కాబట్టి ఎప్పుడైనా సరే బిజినెస్ చేసుకోగలరని నమ్మకం ఉంది. ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనే క్లారిటీతోనే ఉన్నాను. ఇండియాలోనే మెట్రో ఆడియన్స్ తో పాటు యూఎస్ యూకే యూరప్ సౌత్ ఆఫ్రికా అన్ని చోట్ల ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాం. సినిమా రిలీజ్ అయిన మూడు రోజులు తర్వాత కచ్చితంగా మారుమూల గ్రామాల్లో కూడా వెళుతుందనే నమ్మకం ఉంది.

Exit mobile version