Site icon NTV Telugu

Arjun Chakravarthy: ఆగస్టు 29న ‘అర్జున్ చక్రవర్తి’

Arjunchak

Arjunchak

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లు వ్యూస్ తెచ్చుకుంది. యూట్యూబ్‌ లో 1.5 మిలియన్లు వ్యూస్ దాటింది.

ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ మేఘం వర్షించదా రిలీజ్ చేసి ‘అర్జున్ చక్రవర్తి’ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ బ్యుటీఫుల్ లవ్ సాంగ్ గా కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వుంది. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ తమ మ్యాజికల్ వాయిస్ తో కట్టిపడేశారు. ఈ సాంగ్ లో విజయరామరాజు, సిజా రోజ్ కెమిస్ట్రీ లవ్లీగా వుంది. అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామాతో పాటు హార్ట్ టచ్చింగ్ లవ్ స్టొరీతో అర్జున్ చక్రవర్తి అలరించబోతుందని ఈ సాంగ్ ప్రామిస్ చేస్తోంది.

ఈ చిత్రంలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు, ఈ చిత్రానికి జగదీష్ చీకాటి డీవోపీ, ప్రదీప్ నందన్ ఎడిటర్ , సుమిత్ పటేల్ ప్రొడక్షన్ డిజైనర్.ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version