Site icon NTV Telugu

ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా మూవీ “1947”

AR Murugadas Announces Pan India Movie '1947'

ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తాజాగా పాన్ ఇండియా మూవీని చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘1947’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఓం ప్రకాష్ భట్‌, మురుగదాస్ కలిసి సంయుక్తంగా ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించనున్నారు. ‘1947’ మూవీకి తమిళ డైరెక్టర్ పోన్ కుమారన్ దర్శకత్వం వహించనున్నారు. తమిళ, కన్నడ చిత్రాలను తెరకెక్కించే కుమారన్ కన్నడ బ్లాక్ బస్టర్ ‘విష్ణువర్ధన’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ‘1947’ చిత్రం ఏ నేపథ్యంలో రూపొందనుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. కాగా దర్శకుడు మురుగదాస్ ఇంతకుముందు రాజా రాణి వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కాగా తలపతి విజయ్ కోసం మురుగదాస్ ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంలో విజయ్, మురుగదాస్ సూపర్ హిట్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

Exit mobile version