అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ ‘పరదా’కి సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 22న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని థియేటర్స్‌లో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. థాంక్యూ మీట్లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. తెలుగు సినిమాలో పరదా ఒక డేరింగ్ స్టెప్. ఇలాంటి కథని బిలీవ్ చేసి ప్రొడ్యూస్ చేసిన మా నిర్మాత విజయ్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఇలాంటి సినిమాని చేసినందుకు గర్వపడుతున్నాను.
Also Read : Anushka: అనుష్క హోటల్ ముందు 1500 మంది పడిగాపులు కాసేవాళ్ళు !
పరదా నా కెరీర్ లో మోస్ట్ ఫేవరెట్ ఫిలిం. కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చానని రివ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. నేషనల్ మీడియా సినిమా గురించి చాలా అద్భుతంగా రాస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ప్రవీణ్ గారు చాలా జెన్యూన్ గా సినిమా తీశారు. ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. ఇలాంటి సినిమా తీసినందుకు థాంక్యూ అని చెప్తున్నారు. అది చాలా గొప్ప అప్రిసియేషన్. ఈ సినిమా చూసి బయటికి వచ్చాక ఇందులో ప్రతి సీన్ గుర్తు ఉంటుంది. అలా చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంది. అందుకే దీన్ని స్పెషల్ సినిమా అని చెప్తున్నాను. ఈ సినిమా కొన్ని సంవత్సరాలు పాటు గుర్తుండిపోతుంది. కమర్షియల్ సినిమాలో 1000 తప్పులున్నా పట్టించుకోరు.. మా సినిమాకి మాత్రం భూతద్దాలు వేసుకుని చూస్తున్నారు. అలా చూడాలి అనుకుంటే చూడచ్చు కానీ చేసిన ప్రయత్నాన్ని తప్పు పట్టకూడదని ఆమె అన్నారు. దర్శన, సంగీత, ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా విషయంలో నేను ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటాను. మంచి సినిమాని ప్రోత్సహించాలి అనుకునే వారు తప్పకుండా పరదా సినిమా చూడండి. థాంక్యూ సో మచ్.
