ప్రముఖ దర్శకుడు శంకర్ కు ‘అన్నియన్’ (అపరిచితుడు) నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ లీగల్ నోటీస్ పంపారు. ఇటీవల రణ్‌వీర్ సింగ్ హీరోగా శంకర్ హిందీలో అన్నియన్ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా తాను నిర్మించిన ‘అన్నియన్’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తామని ప్రకటించటం పై రవిచంద్రన్ శంకర్ కు లీగల్ నోటీస్ ను పంపినట్లు సమాచారం. తను హిందీ రీమేక్ ప్రకటన వినగానే షాక్ అయ్యానని, అన్నియన్ పూర్తి కథాహక్కులు రచయిత సుజాత నుంచి తాను కొన్నానని అందుకు గాను పూర్తి పేమెంట్ కూడా చేశానని అంటున్నారు రవిచంద్రన్. ఈ కథకు సబంధించి ఎడాప్టేషన్, రీమేక్, మెయిన్ ప్లాట్ కాపీ అనేవి పూర్తిగా ఇల్లీగల్ అంటున్నారు. రణ్ వీర్ తో శంకర్ సినిమా అధికారికంగా ప్రకటించగానే అస్కార్ రవిచంద్రన్ లీగల్ నోటీస్ తో అప్రోచ్ అవగా… అంతకు ముందు రామ్ చరణ్ సినిమా ప్రకటించగానే లైకా ప్రొడక్షన్ వారు తమ ‘ఇండియన్ 2’ సినిమా పూర్తి చేయకుండా వేరే ప్రాజెక్ట్ చేపట్టరాదని లీగల్ నోటీస్ ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు శంకర్ పని అడకత్తెరలో పోకచెక్కలా ఉందంటున్నారు. మరి ఈ లీగల్ నోటీస్ లకు శంకర్ ఏమని జవాబిస్తాడో చూద్దాం.
శంకర్ కు ‘అపరిచితుడు’ నిర్మాత రవిచంద్రన్ లీగల్ నోటీస్
