Site icon NTV Telugu

Annapurna Thalli Buvvamma: త్వరలో ప్రేక్షకుల ముందుకు డొక్కా సీతమ్మ బయోపిక్

Annapurna Thalli Buvvamma

Annapurna Thalli Buvvamma

సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్‌ మట్టా, రోహిల్‌, ఆదిల్‌, రూపేష్‌, కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నపూర్ణ తల్లి బువమ్మ’. గోరి బ్రదర్స్‌ మీడియా, బ్లాక్‌ అండ్‌ వైట్‌ మూవీ మార్క్‌ పతాకాలపై సిరాజ్‌ ఖాదరన్‌ గోరి నిర్మిస్తున్నరు. సురేష్‌ లంకలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, రాధికాపతి దాస్‌ ప్రభు, సాయి విజయేందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి టీమ్‌ అందరికీ షీల్డ్‌లు అందజేశారు.

డొక్కా సీతమ్మ పాత్రధారి శివిక మాట్లాడుతూ ‘నా తొలి చిత్రమది. నటిగా లాంచ్‌ అవ్వడానికి ఇంతకన్నా మంచి టీమ్‌ దొరకదు. అద్భుతమైన పాత్ర ఇచ్చారు. న్యాయం చేశాననే అనుకుంటున్నా’’ అన్నారు. వి. సముద్ర మాట్లాడుతూ ‘‘డొక్కా సీతమ్మగారి జీవిత కథ ఈ సినిమా. ఇలాంటి సినిమాలు తీయడం కొందరు నిర్మాతలకే దక్కుతుంది. ఈ నిర్మాతలకు జీవిత కాలం చెప్పుకునే సినిమా అవుతుంది. ఇందులొ సీతమ్మగారి భర్తగా నటించడం అదృష్టం. నేను ఎంతోమంది స్టార్‌లను డైరెక్ట్‌ చేశాను. కానీ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. దర్శకుడు సురేశ్‌ బాగా తీశాడు’’ అని అన్నారు.

Exit mobile version