Nani Odela 2 : తస్సాదియ్యా.. అన్నంత పని చేశారు.. ఇక అరాచకమే

Nani Srikanth Odela

Nani Srikanth Odela

Anirudh Ravichander Comes On Board For Natural Star Nani, Srikanth Odela #NaniOdela2: నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ ‘దసరా’ తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మళ్లీ చేతులు కలిపారు. #NaniOdela2 దసరా సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సెన్సేషనల్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ #NaniOdela2కి మ్యూజిక్ అందించనున్నారు. జెర్సీ, గ్యాంగ్‌లీడర్ సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్‌ల తర్వాత నాని, అనిరుధ్‌ ల హ్యాట్రిక్ మూవీ ఇది. అయితే వీరి కాంబినేషన్ గురించి గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ రోజు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీంతో ఇక అరాచకమే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు .

Jaya Prada: కోడ్ ఉల్లంఘన కేసులో జయప్రదకు ఊరట

×
×
Ad

శ్రీకాంత్ ఓదెల మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో నానిని ప్రెజెంట్ చేసే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే, లార్జర్ దెన్ లైఫ్ కథని రూపొందించారు. మోస్ట్ ఫెరోషియస్ పాత్ర కోసం నాని మేకోవర్ కి సిద్ధంగా ఉన్నారు. పాషనేట్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సక్సెస్ ఫుల్ అండ్ డైనమిక్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ నానికి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా కానుంది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ స్టొరీ టెల్లింగ్, ప్రొడక్షన్ క్యాలిటీ, టెక్నికల్ గా నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.