టాలీవుడ్ యాక్ట్రెస్, పాపులర్ యాంకర్ అనసూయ మరోసారి అభిమానులపై మండిపడింది. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న అనసూయ పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను చూసి అసహజంగా కామెంట్లు వేస్తూ అశ్రద్ధగా ప్రవర్తించడంతో.. ఆమె ఏ మాత్రం వెనుకాడకుండా వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పింది.
Also Read : National Awards : జాతీయ అవార్డులపై నెటిజన్ల ఫైర్ !
“చెప్పు తెగుద్ది మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య ఉంటే వాళ్లని కూడా ఇలాగే కామెంట్లు చేస్తారా? పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పించలేదా?’ అంటూ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె ధైర్యంగా నిలబడి స్పందించిన తీరు పలువురిని ఆశ్చర్యపరిచింది. రంగమ్మత్త రియాక్షన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనసూయను వ్యాఖ్యాలపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఈజ్ ఆర్ స్పోక్ పర్సన్!’ అంటూ ఫీమెల్ సేఫ్టీ విషయంలో ఆమె స్పందనను ప్రశంసిస్తున్నారు. ఒక పబ్లిక్ ఫిగర్‌గా ఆమె చూపిన తెగువ, స్పష్టత, సోషల్ సెన్సిబిలిటీ నిజంగా ప్రశంసనీయం.
