ప్రముఖ కథానాయిక అమలాపాల్, యంగ్ హీరో రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించిన సీరిస్ ‘కుడి ఎడమైతే’. దీనిని ‘లూసియా, యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంలో రామ్ విఘ్నేష్ రూపొందించారు. ఇండియాలోని డిజిటల్ మాధ్యమంలో ప్రసారం కాబోతున్న తొలి సైంటిఫిక్ క్రైమ్ థిల్లర్ సీరిస్ మోషన్ పోస్టర్ ను శనివారం విడుదల చేశారు. ఇది ఆహాలో త్వరలో స్ట్రీమింగ్ కానుంది.
Read Also : మలయాళ స్టార్ హీరో మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మోహన్ లాల్
ఈ మోషన్ పోస్టర్ లో చూపించిన గోడపై అతికించిన నోటీసులు, గన్, గడియారం వంటి విజువల్స్ ప్రేక్షకుల్లో ఓ ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇందులో అమలాపాల్ విజ్ఞత లేని క్రూరమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుంటే.. రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపించారు. భిన్నమైన రంగాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను… జీవితం ఎలా కలిపింది? సైంటిఫిక్ అంశాలు ఈ క్రైమ్ థ్రిల్లర్‌లోకి ఎలా వచ్చాయి? అనేది తెలుసుకోవాలంటే ‘కుడి ఎడమైతే’ సీరిస్ చూడాల్సిందే! పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సిరీస్‌లో ప్రేక్షకులకు మరిన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఎదురు కానున్నాయి. డైరెక్టర్ పవన్ కుమార్ తన గత చిత్రాల మాదిరే డిఫరెంట్ ఎమోషన్స్, థ్రిల్స్, షాకింగ్ ట్విస్ట్‌లతో మరోసారి తన ప్రతిభను చాటుకోబోతున్నారు.
