Site icon NTV Telugu

Allu Family : అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

Allu Arjun’s Grandmother Kanakaratnamma

Allu Arjun’s Grandmother Kanakaratnamma

మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చుతూ అల్లు రామలింగయ్య గారి సతీమణి, అల్లు అరవింద్ మాతృమూర్తి, అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ (94) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో ఆమె చివరి శ్వాస విడిచారు. రాత్రి 1.45 గంటలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అల్లు కనకరత్నమ్మ గారి భౌతికకాయం ఉదయం 9 గంటలకు అల్లు అరవింద్ నివాసానికి తరలించనున్నారు. మధ్యాహ్నం అనంతరం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Also Read : Chiranjeevi : మన శంకరవరప్రసాద్‌ గారు షూట్ లో వెంకటేశ్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా?

ఇక మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హైదరాబాదుకు చేరుకుంటున్నారు. రామ్ చరణ్ మైసూర్ నుంచి, అల్లు అర్జున్ (బన్నీ) ముంబై నుంచి మధ్యాహ్నానికి చేరుకోనున్నారు. అంత్యక్రియలు ఏర్పాట్లను అల్లు అరవింద్, చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబు వైజాగ్‌లో జరుగుతున్న ఒక పబ్లిక్ మీటింగ్‌లో ఉన్నందున, వారు రేపటికి హైదరాబాదుకు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలపనున్నారు. కాగా అల్లు కనకరత్నమ్మ గారి మృతి పట్ల సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version