NTV Telugu Site icon

AlluArjun : ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70MMకు అల్లు అర్జున్

Bunny

Bunny

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రీమియర్స్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు మూడేళ్లుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు నేడు గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను 70MM స్క్రీన్ పై చూద్దామా అని ప్రేక్షకుల ఎదురుచూపులు తెరపడింది.

Also Read : AskNidhhi : ఆ రెండు సినిమాలతో మరింత దగ్గరవుతా : నిధి అగర్వాల్

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప -2 ప్రీమియర్స్ భారీ ఎత్తున ప్లాన్ చేసారు మైత్రీ నిర్మాతలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70MM లో పుష్ప -2 ప్రీమియర్ ప్రదర్శిస్తున్నారు. కాగా ఈ ప్రీమియర్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు. ఈ రోజు రాత్రి 9:30 గంటల షో కు అల్లు అర్జున్ ఈ సినిమాను ఫ్యాన్స్ తో సంధ్యలో కలిసి చూసేందుకు విచేస్తున్నాడు. మూడేళ్ళుగా ఫ్యాన్స్ కు దూరంగా షూట్ లో బిజీగా ఉన్న బన్నీ ఇలా అభిమానులతో సినిమా చూసేందుకు వస్తుండడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోవైపు పుష్ప -2ప్రీమియర్స్ టికెట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో టికెట్ ధర దాదాపు మూడువేలు పలుకుతుంది. రాత్రి ప్రీమియర్స్ తో మొదలై తెల్లవారుజామున 1 గంట షో తో కంటిన్యూ గా షోస్ వేస్తున్నారు. అటు మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి.

Show comments