Site icon NTV Telugu

Allu Arjun: ఇదేమీ పర్సనల్ ఎటాక్ కాదు.. అందరినీ గౌరవిస్తా!

Alu Arjun

Alu Arjun

అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ కోలుకోవాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను అని అన్నారు. నేను రాంగ్ గా ఎప్పుడు చేయలేదు, చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేశారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలని ఎంతో కష్టపడ్డాను అని ఆయన అన్నారు. నేను వచ్చి కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట అలా అన్నారు అంట కాళ్లు చేతులు విరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే నాకు కచ్చితంగా బాధ వేస్తుంది. ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడటం అంటే నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్లే కదా.

Allu Arjun: నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.. ఎవరినీ బ్లేమ్ చేయను కానీ!

నేను కష్టపడిందే ఈ మూడేళ్లు తెలుగు వాళ్ళ స్థాయిని పెంచడానికి. తెలుగువారి సినిమా సత్తా చాటడానికి అనే ప్రయత్నంతో చేశాను, అలాంటిది నేను అంత మంచి ఉద్దేశంతో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను అంటూ నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు ఎంత బాధ వేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. నేను అందరినీ గౌరవిస్తాను, ఇదేమీ పర్సనల్ ఎటాక్ కాదు ఏమీ కాదు. నేను కేవలం నా గురించి నా సమాచారం జనానికి చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వచ్చాను. ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు అని చెప్పడానికి మాత్రమే మీ ముందుకు వచ్చాను. అని చెప్పుకొచ్చారు.

Exit mobile version