NTV Telugu Site icon

AlluArjun : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్..

Alluarjun (3)

Alluarjun (3)

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.నేడు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు. గతవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్‌ బెయిల్‌పై ఉన్న ఈ రోజు పోలీసుల ఎదుట హాజరుకానున్నాడు.

ఈ కేసు నిమిత్తం కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ తన ఇంటి నుండి చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరాడు. కాసేపట్లో చిక్కడపల్లి పీఎస్ కు చేరుకోనున్నాడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ సహా 18 మందిపై కేసులు నమోదు చేసారు చిక్కడపల్లి పోలీసులు. ఇప్పటికే సంధ్య థియేటర్ మేనేజర్ జైల్లో ఉన్నాడు. ఈ కేసులో 11వ ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ నేడు పోలిసులు ముందు విచారణకు హాజరుకానుండగా బన్నీ స్టేట్ మెంట్ రికార్డింగ్ చేయనున్నారు పోలీసులు. బన్నీకి చిక్కడపల్లి పీఎస్ లో సంధ్య థియేటర్ ఘటన దృశ్యాలు చూపనున్న పోలీసులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ఏం చెబుతాడన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ.

 

Show comments