NTV Telugu Site icon

Allu Arjun : బన్నీ – శ్రీలీల స్పెషల్ సాంగ్ క్రేజి అప్డేట్..

Pushpa 2

Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్పా -2 నిలిచింది. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి అంచనాలు అందుకునేలా సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. సుకుమార్ సినిమాలలో ఐటం సాంగ్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది.

Also Read : Jagathi : ‘కిల్లర్’తో రొమాన్స్ చేయనున్న ‘జ్యోతి పూర్వజ్’

పుష్ప పార్ట్ -1 లో స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావ ఉహు అంటావా’ ఎంతటి సంచలనం నమోదు చేసిందో తెలిసిందే. ఈ పాటలో టాలీవుడ్ బ్యూటీ సమంత డాన్స్ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఈ నేపథ్యంలో రానున్న పుష్ప సెకండ్ పార్ట్ లో మరొక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసాడట సుకుమార్. అయితే ఇన్నిరోజులు ఈ సాంగ్ లో నటించబోయే భామ ఎవరంటూ చర్చ నడిచింది. శ్రద్ద కపూర్ పేరు ఐ = వినిపించినా చివరకు అవేవి కాదని టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల ను ఫిక్స్ చేసాడు సుకుమార్. కాగా ఈ స్పెషల్ సాంగ్ ను నవంబర్ 6 నుండి షూట్ చేసేలా ప్లాన్ చేసాడు. దాదాపు ఐదు రోజులు పాటు ఈ స్పెషల్ సాంగ్ ను తీయనున్నారు. ఇటీవల దేవర సినిమాలోని ఆయుధపూజ సాంగ్ ను కొరియోగ్రాఫ్ చేసిన బాలీవుడ్ ప్రముఖ మాస్టర్ గణేష్ ఆచార్య శ్రీలీల, బన్నీ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయనున్నారు.

Show comments