NTV Telugu Site icon

Allu Aravind : తండేల్ పైరసీ.. అరెస్ట్‌ చేయిస్తాం.. గ్రూప్ అడ్మిన్స్ కి అల్లు అరవింద్ హెచ్చరిక

Allu Aravind

Allu Aravind

నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తండేల్‌’. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెట్టడమే కాదు ఏకంగా ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై నిర్మాత బన్ని వాసు, సమర్పకులు అల్లు అరవింద్‌ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక యాంటీ పైరసీ సెల్ కారణంగా కొన్ని సంవత్సరాలుగా సినిమా పైరసీ జరగడం లేదు. రెండు నెలల నుంచి మళ్లీ పైరసీ రాక్షసి జడలు విప్పుకుంటోంది . దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. చాలా ప్రయత్నాలు చేసి, లింక్‌లు తొలగించారు.

Masthan Sai : మస్తాన్ సాయి కేసులో వేగం పెంచిన పోలీసులు

ఇపుడు సమస్య ఏంటంటే, మంచి నాణ్యత కలిగిన ప్రింట్‌ ఎక్కువగా వచ్చేస్తోంది దాన్ని ఎక్కువగా వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వర్డ్ చేస్తున్నారు అని అన్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్‌లను గుర్తించాం, వారిని సమాచారాన్ని సైబర్‌ క్రైమ్‌ దృష్టికి తీసుకెళ్లాం. వారందనినీ అరెస్ట్‌ చేయిస్తాం అని ఆయన అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ ‘‘వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక, అడ్మిన్లు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ గ్రూపులో ఎవరో లింక్ వేసినా మీరు జైలు వెళ్లే అవకాశం ఉందని అన్నారు . ఈవిషయంలో మేము చాలా సీరియస్ గా ఉన్నాం. పైరసీ అనేది క్రైమ్‌, గతం కంటే ఇప్పుడు సైబర్‌ సెల్స్‌ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా సులభం అని అన్నారు . కొంతమంది వెబ్‌సైట్స్‌లోనూ పెడుతున్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ‘తండేల్’ పైరసీ ప్రింట్‌ ప్రదర్శించడం దారుణం. సినిమా సక్సెస్‌ను ఆస్వాదించే సమయంలో ఇదొక అడ్డంకిలా మారిందని ఆయన అన్నారు.