NTV Telugu Site icon

Allu Aravind: అల్లు అర్జున్ కిమ్స్ కు రాకపోవడంపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు

Allu Aravind

Allu Aravind

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన హస్పటల్‌ వైద్యాధికారులతో, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ” అందరికి నమస్కారం.. ఇప్పుడే హస్పటల్‌లో ఉన్న శ్రీతేజ్‌ను ఐసీయూలో చూశాను. డాక్టర్లందరితోనూ మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవరీ అవుతున్నాడు. గత 14 రోజుల్లో.. లాస్ట్‌ 10 డేస్‌ల్లో రికవరీ బాగా కనిపిస్తుంది. బట్‌ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. అయితే శ్రీతేజ్‌ కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం. దీంతో పాటు ప్రభుత్వం కూడా మేము కూడా శ్రీతేజ్‌ను సంపూర్ణ ఆరోగ్యంగా చూడటానికి రెడీగా ఉన్నాం అని చెప్పడ అభినందనీయం. చాలా మంది అభిమానులు, బందువులు, మిత్రులు అల్లు అర్జున్‌ ఎందుకు హస్పటల్‌కు వెళ్లలేదు అని అడుగుతున్నారు.

Maruti Suzuki Grand Vitara: మార్కెట్లోకి మరో మారుతీ 7-సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

దానికి కారణం. తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఉదయమే అర్జున్‌ హస్పటల్‌కు వెళ్లదామనుకున్నాడు. కానీ హస్పటల్‌ అధికారులు నిన్నే కదా ఈ సంఘటన జరిగింది. మీరు హస్పటల్‌కు వచ్చే కార్యక్రమం వాయిదా వేసుకోమని అన్నారు. కరెక్ట్‌ అనిపించింది. అందుకే రాలేదు. ఇక ఆ రోజే అర్జున్‌పై కేసు వచ్చింది. ఆ కేసులో లీగల్‌ టీమ్‌ హెడ్‌ నిరంజన్‌ రెడ్డి హస్పటల్‌కు వెళ్లకూడదు.. వారిని కలవకూడదు అని ఆయన స్ట్రాంగ్‌గా చెప్పారు. ఆ తరువాత మేము రావడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఇక బన్నీ ఒక రోజు బాధపడుతూ నేను చూడలేకపోయాను.. మీరైనా వెళ్లండి.. డాడీ అన్నాడు. అందుకే నేను ఇక్కడికి రావడానికి ముందు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకున్నాను. ఈ రోజు వచ్చాను. ఈ అనుమతి నాకు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్‌ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పోలీస్‌ శాఖ వారికి, హస్పటల్‌ యజమాన్యానికి, సీఇవో అభిమన్యు, మెడికల్‌ డైరెక్టర్‌ సంహిత్‌కు అందరికి నా కృతజ్క్షతలు తెలియజేస్తున్నాను’ అన్నారు

Show comments