NTV Telugu Site icon

Allari Naresh : ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చిన అల్లరి నరేష్..

Whatsapp Image 2024 04 29 At 1.43.20 Pm

Whatsapp Image 2024 04 29 At 1.43.20 Pm

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న పక్కా మాస్ యాక్షన్ మూవీ “దేవర”..ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన మేకర్స్ విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాలో ప్రముఖ నటుడు అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ విషయంపై అల్లరి నరేష్ స్పందించారు. తాను దేవర సినిమాలో ఎలాంటి పాత్ర పోషించడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలని ఎవరూ నమ్మొద్దని ఆయన తెలిపారు.ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని అల్లరి నరేష్ చెప్పారు.అలాగే టాలీవుడ్ హీరోలందరిలో ఎవరితోనైనా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు నరేష్ తెలిపారు.

ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.ఈ మూవీ మే ౩వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ప్రస్తుతం నరేష్ ఈ చిత్రం ప్రమోషన్స్ లో బిజీ గా వున్నాడు.రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలకా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాంది ,ఉగ్రం వంటి సీరియస్ పాత్రలతో మెప్పించిన అల్లరి నరేష్ ఈ సారి రూటు మార్చి తనకు ఎంతో ఇష్టమైన కామెడీ జోనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..