బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ముగ్గురు బాలీవుడ్ భామలతో కలిసి సినిమాను వీక్షించారు. దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. “బెల్ బాటమ్” థియేట్రికల్ విడుదలకు ముందు సినిమా నిర్మాతలు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను హీరోయిన్లు వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తాతో పాటు వీక్షించారు. ఈ చిత్రం జూలై 27 న థియేటర్లలో విడుదలవుతోంది. ప్రత్యేక స్క్రీనింగ్ పిక్స్ ను హుమా ఖురేషి, వాణీ కపూర్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో షేర్ చేశారు.
Read Also : సీటిమార్ : “జ్వాలారెడ్డి” సాంగ్ మరో రికార్డు
ఇక అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ “బెల్ బాటమ్”. ఇందులో వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. అక్షయ్ రా ఏజెంట్ పాత్ర పోషిస్తుండగా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను లారా దత్తా పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ భార్యగా వాణి కపూర్ నటించారు. ‘బెల్ బాటమ్’ 80వ దశాబ్దంలో ఇండియాలో అలజడి సృష్టించిన విమానం హైజాక్ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రానికి రంజిత్ తివారి దర్శకత్వం వహించగా పూజ ఎంటర్టైన్మెంట్స్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
