బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జమ్మూ కశ్మీర్ లోని తులైల్ క్యాంపును సందర్శించారు. ఈమేరకు తన హృదయం పూర్తిగా జవాన్ల పట్ల గౌరవంతో నిండిపోయిందని అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అక్కడ సరిహద్దు భద్రతా విధులు నిర్వర్తిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లతో ఉల్లాసంగా గడిపారు. వారితో కలిసి డ్యాన్సులు చేసిన అక్షయ్ కుమార్, సరదాగా వాలీబాల్ కూడా ఆడారు. కాగా ఉత్తర కశ్మీర్లోని బంధీపురా జిల్లాలో నీరు గ్రామ పాఠశాల భవన నిర్మాణానికి రూ.కోటి విరాళం అందజేశారు.
పాఠశాల నిర్మాణానికి అక్షయ్ కుమార్ భారీ విరాళం
