Site icon NTV Telugu

‘బెల్ బాట‌మ్’పై అక్షయ్ క్లారిటీ!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కొత్త చిత్రం ‘బెల్ బాటమ్’ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. భారీ ధరకు హక్కులు దక్కించుకున్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించబోతున్నారనే వార్తల నేపథ్యంలో అక్షయ్ కుమార్ స్పందించారు. నా సినిమాల విడుద‌ల గురించి ఎదురుచూస్తున్న అభిమానులు మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. సూర్య‌వంశి, బెల్ బాట‌మ్ చిత్రాలు ఇండిపెండెన్స్ డే కానుక‌గా విడుద‌ల‌వుతున్నాయి. రెండు చిత్రాల నిర్మాత‌లు విడుద‌ల తేదీల‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. స‌రైన స‌మ‌యంలో సినిమాల విడుద‌ల ఎప్పుడ‌నేది ప్ర‌క‌టిస్తార‌ని అక్షయ్ క్లారిటీ ఇచ్చాడు.

Exit mobile version