అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ వెండి తెరపై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు 4 చిత్రాల్లో నటించిన ఈ యంగ్ హీరోకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు. ఇక తాజాగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న అఖిల్ తాజాగా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. అఖిల్ డాషింగ్ లుక్ లో కన్పిస్తున్న పిక్ ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. గడ్డం, జుట్టుతో అఖిల్ కొత్త మేకోవర్ తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. జూన్ 19న విడుదల కానున్న ఈ చిత్రంతోనైనా అఖిల్ అంచనాలను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’గా కనిపించబోతున్నాడు అఖిల్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ చూడని అఖిల్ ‘ఏజెంట్’లో చూడొచ్చు అంటూ సురేందర్ రెడ్డి సినిమాపై అప్పుడే అంచనాలను పెంచేశారు.
డాషింగ్ లుక్ లో అఖిల్ అక్కినేని
