Akhil Akkineni’s Lenin Movie Solo Release on June 26: ‘ఏజెంట్’వంటి డిజాస్టర్ తర్వాత ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు అఖిల్ అక్కినేని. ఇటీవల ఈ చిత్రం గురించి కింగ్ నాగార్జున పాజిటివ్‌గా స్పందించడంతో.. అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇది అఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రమవుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
అయితే లెనిన్ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ఇప్పుడు తెరపడింది. లెనిన్ వాయిదా పడుతందనే వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా పరిస్థితులు అనుకూలించాయి. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాను జూన్ 4న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఎలాంటి పోటీ లేకుండా జూన్ 26న ‘లెనిన్’ సోలోగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు మార్గం సుగమమైంది. ఇతర పెద్ద సినిమాల పోటీ లేకపోవడం లెనిన్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
స్వయంగా నాగార్జున సినిమా అవుట్‌పుట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం లెనిన్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఆమె గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి సోలో రిలీజ్‌తో అఖిల్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
