Site icon NTV Telugu

NBK : అఖండ 2 ఓవర్సీస్ రైట్స్ డీల్ వివరాలు. బాలయ్య కెరీర్ హయ్యెస్ట్

Akhanda 2

Akhanda 2

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన  ‘సింహ‌’, ‘లెజెండ్’, ‘అఖండ‌’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఇప్పడు బాలయ్యతో అఖండకు సీక్వెల్ గా ‘అఖండ‌-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Also Read : SSMB 29 : GlobeTrotter ఈవెంట్.. మీడియా కెమెరాలకు నో ఎంట్రీ

మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు స్టేట్స్ లో ఈ సినిమాను రికార్డ్ ధరకుడీల్ క్లోజ్ అయింది. తాజాగా అఖండ 2 ఓవర్సిస్ రైట్స్ ను మోక్ష మూవీస్ సినీ గ్యాలక్సీ మరియు శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ రూ. 15 కోట్లకు కొనుగోలు చేసారు. కేవలం నార్త్ అమెరికా వరకు 2.5 మిలియన్ డాలర్స్ కు డీల్ క్లోజ్ చేసారు. ఇక ఈ సినిమ డిజిటల్ రైట్స్ ను హాట్ స్టార్ అవుట్ రేట్ కు కొనుగోలు చేసింది. అన్ని లాంగ్వేజెస్ రైట్స్ ను రూ. 85 కోట్లకు అమ్ముడయ్యాయి. బాలయ్య సినిమాకు రావడం రికార్డ్ అనే చెప్పాలి. దానికి తోడు హింది తేయాట్రికల్ రైట్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా నిర్మాతలకు ఓటీటీ రూపంలో జాక్ పాట్ కొట్టినట్టే. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న అఖండ 2 ను ఈ ఏడాది డిసెంబరు 5 న రిలీజ్ కానుంది/. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట‌-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version