నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2’. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడగా, సినీ ప్రేమికులు దీన్ని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.
Also Read : Malavika Mohanan : పెద్ద సినిమాలు కాదు.. అలాంటి పాత్రలే ముఖ్యం
ప్రస్తుతం మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ “పార్టీ సాంగ్” ని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ నేటి నుంచి ప్రారంభమవుతుందట.హైద్రబాద్‌లో దీని కోసం ఒక ప్రత్యేకమైన సెట్ ల్లో ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఇన్ సైడ్ సమాచారం ప్రకారం, ఈ సాంగ్ పూర్తయిన వెంటనే సినిమా షూటింగ్ సుమారు ముగిసినట్టే అంటా. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
ఇక సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు 14 రీల్స్ సంస్థ వహిస్తోంది. రాజకీయ, సాంఘిక థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా, అభిమానులను థియేటర్ వద్ద కట్టిపడేలా చేస్తుందని మేకర్స్ విశ్వసిస్తున్నారు. పెద్ద స్కేల్ సెట్‌లు, విభిన్నమైన పాటలు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రధాన అంశాలుగా ఉంటాయట. అఖండ 2 పై అభిమానుల ఆసక్తి మరింత పెరుగుతున్న సమయంలో, ఈ సాంగ్ షూట్ పూర్తి కావడం సినిమా విడుదలకు మరో కీలక మెట్రిక్‌గా మారనుంది. రీసెంట్ అప్డేట్ ప్రకారం, సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే మేకర్స్ విడుదల చేయనున్నారు.
