NTV Telugu Site icon

‘రుద్ర’తో అజయ్ దేవగన్ డిజిటల్ ఎంట్రీ

Ajay Devgn to make his digital debut with Rudra - The Edge Of Darkness

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. తన మొట్టమొదటి క్రైమ్-డ్రామా సిరీస్ ‘రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు అజయ్. బిబిసి స్టూడియోస్ ఇండియా సహకారంతో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సిరీస్ ఇద్రీస్ ఎల్బా రూపొందించిన బ్రిటిష్ షో ‘లూథర్’కు హిందీ రీమేక్. ఈ హాట్‌స్టార్ స్పెషల్స్ సిరీస్ త్వరలో నిర్మాణం కానుంది. ముంబైలోని ఐకానిక్ లొకేషన్స్ లో ఈ సిరీస్ చిత్రీకరించబడుతుంది. ఈ సిరీస్ లో అజయ్ దేవ్‌గన్ పోలీసు పాత్రలో నటించనున్నారు. త్వరలోనే ‘రుద్ర’ డిస్నీ + హాట్‌స్టార్ విఐపి, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియంలో ప్రసారం కానుంది. ఇక అజయ్ దేవగన్ ఇదివరకే ‘సింగం రిటర్న్స్’ వంటి చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.