Site icon NTV Telugu

AI Heros: మన హీరో హీరోయిన్లు ఇలా అయిపోతే.. అమ్మో.. ఆ ఊహే భయంకరం!

Ai Stars

Ai Stars

గత కొన్ని నెలలుగా ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీని ద్వారా చాలా పనులను సులభంగా చేసుకుంటున్నారు టెక్కీలు. అయితే, కొంతమంది మాత్రం ఏఐ ద్వారా తమ సరదా తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా, తమకు నచ్చిన హీరోలకు ప్రాంప్టింగ్ ఇచ్చి డైలాగ్‌లు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొన్ని సరదాగా ఉంటే, కొన్ని మాత్రం ప్రమాదకరంగా ఉంటాయి.

Also Read:Chicken: ఎక్స్‌ట్రా “చికెన్” కావాలన్నందుకు ఫ్రెండ్‌నే చంపేశాడు..

అయితే, ఇప్పుడు ఏకంగా మన హీరోలు, హీరోయిన్‌లు ఒకవేళ లావుగా ఉండి, సినిమా హీరోలు లేదా హీరోయిన్‌లుగా కాకుండా సాధారణ జీవితం గడుపుతూ ఉంటే వారు ఎలా ఉంటారనే ఉద్దేశంతో ఒక ఔత్సాహికుడు ఏఐ వీడియో తయారు చేశాడు. ఆ ఏఐ వీడియోలో అనుష్క గాజులు అమ్ముతూ ఉంటే, మహేష్ బాబు మామిడి పళ్ళు అమ్ముతూ కనిపిస్తున్నాడు. ప్రభాస్ మామిడి జ్యూస్ అమ్ముతూ ఉండగా, రష్మిక చేపలు అమ్ముతూ, రామ్ చరణ్ వేరే ఏదో పనిలో బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా వంట చేస్తూ ఉండడం గమనార్హం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిస్మస్ స్టార్స్ అమ్ముతూ ఉండడం విశేషం.

Exit mobile version