Site icon NTV Telugu

`బాహుబ‌లి`ని బీట్ చేస్తున్న `ఆదిపురుష్`!

Adipurush Breaks Bahubali Record

మేగ్న‌మ్ ఓపస్ మూవీ బాహుబ‌లి -2 అనేక అంశాల‌లో దేశ వ్యాప్తంగా స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించింది. జాతీయ స్థాయిలో ఎలా ఉన్నా ప్రాంతీయ చిత్రాల రికార్డుల విష‌యానికి వ‌చ్చే స‌రికీ ఖ‌చ్చితంగా నాన్ బ‌హుబ‌లి అని ద‌ర్శ‌క నిర్మాత‌లు, ట్రేడ్ వ‌ర్గాలు మెన్ష‌న్ చేయ‌డం అనేది సాధార‌ణ‌మై పోయింది. బాహుబలి, బాహుబ‌లి -2 చిత్రాల‌కు సంబంధించిన కొన్ని రికార్డుల‌ను క్రాస్ చేయ‌డం ఎవ‌రి వ‌ల్లా కాద‌నీ తేలిపోయింది. అయితే… ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న ప్ర‌భాస్ తాజా చిత్రం ఆదిపురుష్ ఓ విష‌యంలో ఇప్ప‌టికే బాహుబ‌లి-2ని క్రాస్ చేసి త‌న స‌త్తాను చాటుకుంది. అంతేకాదు… బాహుబ‌లికి మూడింత‌లు అనే ప్ర‌చారం కూడా పొందుతోంది. ఇంత‌కూ విష‌యం ఏమంటే…. ఈ కొత్త రికార్డ్ ను విఎఫ్ఎక్స్ విష‌యంలో ఆదిపురుష్ సాధించాడు. బాహుబ‌లి-2 సినిమాకు 2500 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. అదే ఇప్పుడు ఆదిపురుష్కు దాదాపు 8000 విఎఫ్ఎక్స్ షాట్స్ ను ఉప‌యోగించ‌బోతున్నార‌ట‌. ఇంత‌వ‌ర‌కూ భార‌త దేశంలో ఏ సినిమాకూ ఇన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ను ఉప‌యోగించిందే లేదట‌. పైగా ఇది త్రీడీలో రూపుదిద్దుకోవ‌డం మ‌రో విశేషం. ఏదేమైనా…. నిర్మాణ ద‌శ‌లో ఉండ‌గానే ఆదిపురుష్ ఎన్నో అంశాల‌లో అగ్ర‌స్థానంలో నిలిచేలా ఉంది. మ‌రి విడుద‌లైన త‌ర్వాత క‌థ ఎలా ఉంటుందో చూడాలి!!

Exit mobile version