NTV Telugu Site icon

బాబు కు జ‌న్మ‌నిచ్చిన రిచా గంగోపాధ్యాయ‌

శేఖ‌ర్ క‌మ్ముల లీడ‌ర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఎన్.ఆర్.ఐ.భామ రిచా గంగోపాధ్యాయ. ఆ త‌ర్వాత మిర‌ప‌కాయ్, మిర్చి, నాగ‌వ‌ల్లి వంటి తెలుగు సినిమాల‌తో పాటు కోలీవుడ్ లోనూ ప‌లు చిత్రాల్లో న‌టించి క‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. నాగార్జున భాయ్ చిత్రంలో చివ‌ర‌గా న‌టించిన రిచా ఆ త‌ర్వాత అమెరికా తిరిగి వెళ్ళిపోయి, బిజినెస్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ చేసింది. ఇక 2019లో త‌న స్నేహితుడు జోయ్ లంగెల్లాను రిచా వివాహం చేసుకుంది. అయితే క‌రోనా స‌మ‌యంలో ప్రెగ్నెంట్ గా ఉన్న రిచా గంగోపాధ్యాయ ఈ రోజు ఉద‌యం ఇన్ స్టాగ్రామ్ లో తాను త‌ల్లిని అయిన విష‌యాన్ని తెలియ‌చేస్తూ, త‌న కొడుకు ఫోటోను పోస్ట్ చేసింది. మే 27న రిచా గంగోపాధ్యాయ జ‌న్మ‌నిచ్చిన ఈ బాబుకు లుకా షాన్ లంగెల్లా అనే పేరు పెట్టారు. ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో త‌న‌కు ఎంతో చ‌క్క‌గా చూసుకున్న వైద్య సిబ్బందికి, కుటుంబ స‌భ్యుల‌కు రిచా ధ్యాంక్స్ చెప్పింది. ఇత‌ర ఫ్యామిలీ మెంబ‌ర్స్ కు, స్నేహితుల‌కు ఎప్పుడెప్పుడు త‌న చిన్నారి బాబును ప‌రిచయం చేస్తానా అని ఉన్న‌దంటూ రిచా పేర్కొంది.