Site icon NTV Telugu

Rambha: ఒకప్పుడు కుర్రాళ్ళ కలల హీరోయిన్ రంభ.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?

Actress Rambha

Actress Rambha

Actress Rambha with family Seek Blessings at Guruvayoor Temple: ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అచ్చ తెలుగు విజయవాడ అమ్మాయి, అందాల భామ రంభ. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆమె. వరుస అవకాశాలను చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇంద్ర కుమార్ అనే వ్యక్తిని వివాహమాడి విదేశాల్లో సెటిల్ అయ్యింది. హీరోయిన్ గా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టినా అడపాదడపా స్పెషల్ సాంగ్స్ లో అదరగొట్టింది. అంతేకాకుండా డాన్స్ షోస్ లో జడ్జిగా కూడా వ్యవహరించింది. ఆ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న రంభ.. రీఎంట్రీకి సిద్దమవుతుందని సమాచారం. పెళ్లి తరువాత బొద్దుగా మారిన రంభ.. కష్టపడి బరువు తగ్గి స్లిమ్ గా మారింది.

Charishma Naidu : కన్నడిగులతోనే తెలుగు సీరియల్స్‌, ఇక మనమెందుకు.. నటి చరిష్మా నాయుడు సంచలన ఆరోపణలు

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న రంభ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం రంభ తన పెద్ద కూతురితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె చాలా అందంగా ఉంది అంటూ పొగిడేశారు. ఇక ఇప్పుడు 2010లో తన సినీ జీవితాన్ని ముగించుకున్న రంభ తన కుటుంబంతో కలిసి టొరంటోలో నివసిస్తోంది. పెళ్లి తర్వాత రంభ కొన్ని డ్యాన్స్ రియాల్టీ షోలలో మాత్రమే కనిపించింది. తాజాగా రంభ తన కుటుంబంతో కలిసి కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు భర్త ఇంద్ర, ముగ్గురు పిల్లలు, కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఉన్నారు. రంభ చాలా సింపుల్ గా చురీదార్ వేసుకుని గుడికి వచ్చింది. దీంతో ఆమె వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Exit mobile version