Site icon NTV Telugu

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్…!

Actress Pranitha Subhash ties the knot on Sunday

తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ తర్వాత సిద్దార్థ్ తో చేసిన ‘బావ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఎక్కువగా కన్నడ తెలుగు, తమిళ భాషల్లో నటించే ఈ భామ సైలెంట్ గా వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని ఒక్కటయ్యారు. ఈ భామ కూడా రెండో వేవ్ లో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే ఒక బిజినెస్ మాన్ తో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద ప్రణీత ఇంకా అధికారికంగా స్పందించలేదు. ప్రణీత స్నేహితురాలు ఒకరు తన సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి వివాహం గ్రాండ్ గా చేసుకోవాలని భావించినప్పటికీ కరోనా కారణంగా ఇలా సింపుల్ గా కానిచ్చేశారని తెలుస్తోంది.

Exit mobile version