‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తిరెడ్డికి పితృవియోగం కలిగింది. కీర్తి తండ్రి, టి.ఆర్.ఎస్ నాయకుడు గడ్డం ఆనందరెడ్డి ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈయన వయసు 60 సంవత్సరాలు. గుండెనొప్పితో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకు వచ్చిన కొద్ది సేపటికే తుదిశ్వాస విడిచారు. ఆనందరెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపి కేశపల్లి గంగారెడ్డి తనయుడు. ఆరంభంలో కాంగ్రేస్ యూత్ లీడర్ గా పని చేశారు ఆనంద్ రెడ్డి. 2014లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్లేగా బిజెపి తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టి.ఆర్.ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. అందులో ఒకరు కీర్తిరెడ్డి. కీర్తి పెళ్ళి 2004లో హీరో సుమంత్ తో జరిగింది. ఆ తర్వాత 2006లో వారిద్దరూ విడిపోయారు.
నటి కీర్తి రెడ్డికి పితృవియోగం
