Site icon NTV Telugu

Hema: నేను డ్రగ్స్ తీసుకోలేదు.. పరువు భూస్థాపితం చేశారు.. డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ కావాలి!

Hema Suspended From Maa

Hema Suspended From Maa

Actress Hema Releases a Video Seeking CM Revanth Reddy Appointment: కొంతకాలం క్రితం బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలతో అరెస్టయిన హేమ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను డ్రగ్స్ తీసుకోలేదు అని మరోసారి చెప్పే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించి తాను టెస్ట్ లు కూడా చేయించుకున్నానని ఆమె వెల్లడించింది. ‘’కొన్ని నెలలుగా నా మీద మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, అది మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువు ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిందే.

Samantha: ఆ స్పెషల్ విషయం చెప్పేసిన సమంత.. ఏంటంటే?

నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా జుట్టు, నా గోళ్లు, బ్లడ్ అన్నీ ఇచ్చి టెస్ట్ చేయించుకున్నాను. ఇందులో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ ఇది నేను చానల్స్ కి రావడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఒక్కటే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ, అని మీ ముందు చెప్పడానికి. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలని అడగడానికి, అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ అడగడానికి ఈ వీడియో పెడుతున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.

Exit mobile version