Site icon NTV Telugu

Dhruva Sarja: ‘పుష్పరాజ్’గా అర్జున్ మేనల్లుడు!

Pushparaj

Pushparaj

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కన్నడనాట కథానాయకుడిగా చక్కని గుర్తింపు పొందుతున్నాడు. అతను నటించిన సూపర్ హిట్ మూవీ ‘భార్జరీ’ ఇప్పుడు తెలుగులో అనువాదమై విడుదల కానుంది. రచిత రామ్, హరిప్రియ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చేతన్ కుమార్ డైరెక్ట్ చేశాడు. ‘కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి కృషి చేయండి’ అన్న అబ్దుల్ కలామ్ మాటలను అక్షరాల పాటిస్తూ అంచలంచెలుగా ఎదిగారు బొడ్డు అశోక్. ఇంతవరకూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఆయన ఇప్పుడీ సినిమాతో నిర్మాతగా మారారు. కన్నడ చిత్రం ‘భార్జరీ’ని ఆయన తెలుగులో ‘పుష్పరాజ్ – ది సోల్జర్’ పేరుతో డబ్ చేశారు. ఆర్. యస్. ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై ఈ మూవీ తెలుగులో వస్తోంది. అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘పుష్పరాజ్’ను ఈ నెల 19న బాక్సాఫీస్ బరిలో దించబోతున్నారు నిర్మాత.

ఈ సందర్భంగా బొడ్డు అశోక్ మాట్లాడుతూ, ”ఇందులో ధ్రువ సర్జా, రచితారామ్ జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇదో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్. తెలుగు ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ అంశాలు అన్నీ ఇందులో ఉన్నాయి. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా దేశ వ్యాప్తంగా అఖండ విజయం సాధించిన నేపథ్యంలో మేం ఈ టైటిల్ పెట్టగానే మూవీకి ఊహించని క్రేజ్ వచ్చేసింది. ఇప్పటి వరకూ నేను ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధిస్తూనే వచ్చాను. అదే విజయం నాకు ఈ మూవీతో చిత్రసీమలో కూడా లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాను. ఈ నెల 19న రెండు తెలుగు రాష్ట్రాల్లో మూవీ మాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ ద్వారా అత్యధిక థియేటర్లలో మా ‘పుష్పరాజ్’ను జనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం” అని చెప్పారు.

 

 

Exit mobile version