Site icon NTV Telugu

Abhinaya : ముడు ముళ్ళ బంధంతో ఒక్కటైన అభిన‌య..కార్తీక్

Abhinaya

Abhinaya

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అనే సామెతను ఈ మధ్య సెలబ్రెటిలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ఉన్నారు . ఒక్కొక్కరుగా కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటి అభినయ కూడా వివాహ బందం లోకి అడుగుపెట్టింది. పుట్టుకతో మూగ, చెవుడు వంటి అంగ వైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో నటిగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అభిన‌య. అయితే గ‌త కొద్ది రోజులుగా ఈ అమ్మడి ప్రేమ‌,పెళ్లి వార్తలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దీంతో ఒక్క ఫోటోతో.. కుండ బద్దలు కొట్టి అన్ని పుకార్లకు తెరదించింది. ఎంగేజ్‌మెంట్ రింగ్స్ తొడిగి ఉన్న చేతుల ఫోటోలను షేర్ చేసి తాను త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా అంద‌రికి క్లారిటీ ఇచ్చింది.

Also Read: Nazriya : పూర్తిగా కోలుకుని త్వరలోనే మీ ముందుకోస్తా..

ఇక చెప్పినట్లుగానే హైదరాబాద్‌కు చెందిన వీ. కార్తీక్ తో బుధవారం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అభినయ, కార్తీక్, చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు, కాగా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దల అంగీకారంతో ఎట్టకేల‌కి ముడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version