NTV Telugu Site icon

Aarambham: ‘ఆరంభం’ ఆరంభమైంది.. ఎక్కడ చూడాలంటే?

Bg Aarambham

Bg Aarambham

Aarambham is now streaming exclusively on Amazon Prime Video: ‘C/o కంచరపాలెం’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ భగత్ లీడ్ రోల్ లో నటించిన మైండ్ బ్లోయింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ ‘ఆరంభం’. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్, డెజావూ అంశాలను అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు మేకర్స్. భవానీ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ యూనిక్ ఎంటర్‌టైనర్ విడుదలైయింది.

Vishnu Priya: విష్ణుప్రియ మాజీ లవర్ తో రీతూ చౌదరి రిలేషన్?

‘ఆరంభం’ కథలోకి వస్తే, ఖైదీ నంబర్ 299 కాలా ఘటి జైలు నుండి ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పించుకుంటాడు. ఈ మిస్టీరియస్ ఎస్కేప్ అధికారులను అయోమయానికి గురి చేస్తుంది. ఈ కేసును ఛేదించడానికి ఇద్దరు డిటెక్టివ్‌లు వస్తారు. వారి పరిశోధనలో ఆశ్చర్యపరిచే అంశాలు వెలుగులోకి వస్తాయి. టైమ్ ట్రావెల్, డెజావు కాన్సెప్ట్ బ్లెండ్ చేసి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ చేసే ఈ సినిమా ఆడియన్స్ కి మునుపెన్నడూ లేని అనుభూతిని ఇస్తోంది. మోహన్ భగత్, సుప్రీత సత్యనారాయణ, భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ వి తిరుమలేష్ AVT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మించారు.

Show comments