Site icon NTV Telugu

Aamir Khan : ఇంతలోనే అంత మార్పా.. షాక్ ఇచ్చిన అమీర్ ఖాన్ కొత్త లుక్

Ameerkhan

Ameerkhan

బాలీవుడ్‌లో నటులు తమ పాత్రల కోసం శరీరంలో భారీ మార్పులు చేయడం సాధారణమే. అయితే ఈ మార్పులు కొన్నిసార్లు వారి కెరీర్‌ను ప్రభావితం చేస్తాయి కూడా. ఒకప్పుడు హీరోయిన్ అనుష్క శెట్టి ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగి తర్వాత తగ్గేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. అలానే ఇప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకున్నాడు అమీర్ ఖాన్. ఇటీవల ‘సితారే జమీన్ పర్’ సినిమాలో యంగ్‌గా, స్టైలిష్‌గా కనిపించిన అమీర్, రజనీకాంత్ కూలీలో తన స్టైల్‌తో మెప్పించాడు. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన లుక్‌తో షాక్ ఇచ్చాడు. కారణం ఆయన చేస్తున్న కొత్త ప్రాజెక్ట్.

Also Read : Rakul Preet Singh : చిన్ననాటి కష్టాలే జీవిత పాఠాలు.. రకుల్ ఎమోషనల్ కామెంట్స్

రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో అమీర్, భారతీయ సినీ పితామహుడు ఫాల్కే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన బరువు పెరిగి కొత్త లుక్‌లో రెడీ అయ్యాడు. ఈ ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం అమీర్ ఖాన్ అనేక స్క్రిప్టులు పక్కన పెట్టాడని బాలీవుడ్ టాక్. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించబోయే రజనీకాంత్–కమల్ హాసన్ మల్టీస్టారర్ తర్వాత అమీర్‌తో సినిమా చేయాలనుకున్నా, అది వాయిదా పడిందని సమాచారం. అయితే అమీర్ కెరీర్‌ మొత్తంలో పాత్రల కోసం ఎంత కష్టమైనా భరించి, కొత్త ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు. ఈసారి కూడా అదే ధైర్యంతో ముందుకెళ్తున్నాడు. అభిమానులు మాత్రం – “అమీర్ కష్టాలు ఎప్పుడూ వృథా కావు, ఈసారి కూడా తప్పకుండా సక్సెస్ అందుకోవాలి” అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version