Site icon NTV Telugu

లడఖ్‌లో ‘లాల్ సింగ్ చద్దా’ యాక్షన్ సన్నివేశాలు…!

Aamir Khan to shoot for action sequences of 'Laal Singh Chaddha' in Ladakh

అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ గా తెరకెక్కుతోంది ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సమస్యల కారణంగా ముందుగా అనుకున్న షెడ్యూల్ లు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. అయితే అమీర్ ఖాన్ మాత్రం లడఖ్‌లో తన ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రం కోసం యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడానికి సిద్ధమవుతున్నాడు. కార్గిల్‌లోని వివిధ ప్రదేశాలను రెక్కీ చేస్తున్న అమీర్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ జరిగే షెడ్యూల్ 45 రోజులు ఉండే అవకాశం ఉందని, ఈ చిత్రంలోని చాలా యాక్షన్ సన్నివేశాలు లడఖ్, కార్గిల్ ప్రాంతాల్లో చిత్రీకరించబడతాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించాల్సి ఉంది. కానీ విజయ్ సేతుపతి స్థానంలో నాగ చైతన్య ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాల కోసం యూనిట్‌లో చేరనున్నారు.

Exit mobile version