Site icon NTV Telugu

Aa Gang Repu 3: ఆసక్తి రేపుతున్న ‘ఆ గ్యాంగ్ రేపు 3’!

Aa Gang Rape

Aa Gang Rape

ఇంతకు ముందు 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్‌ సాధించి వైరల్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా పేరుపొందిన ‘ఆ గ్యాంగ్‌ రేపు’. ఆ ‘ఆ గ్యాంగ్‌ రేపు’కి స్వీకెల్‌ గా ‘ఆ గ్యాంగ్‌ రేపు-2’ షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించిన టీమ్‌ నుండి రాబోతున్న మరో సన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఆ గ్యాంగ్‌ రేపు-3’. ఇది త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దర్శకుడు యోగీ కుమార్‌ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ లవ్‌ యూ టూ ఓటీటీలో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సారి ఈ ఆ గ్యాంగ్‌ రేపు-3 ఆయనకు దర్శకుడిగా మరింత గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

Also Read:Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు

నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మించిన ఈ చిత్రానికి, హ్యాండ్ హెల్డ్ స్టైల్ చిత్రీకరణ చేసిన సినిమాటోగ్రాఫర్ నాని ఐనవెల్లి విజువల్స్ మరింత ఎంగేజింగ్ గా ఉంటాయి. కథన వేగం, మూడ్‌ను ఖచ్చితంగా నిలబెట్టిన ఎడిటర్ అనిల్ కుమార్ జల్లు కట్ ఈ సినిమా టెన్షన్‌ను అద్భుతంగా పటిష్టం చేసింది.మరియు 2017లో మొదటి SIIMA షార్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు, కన్నడ హిట్ షుగర్ ఫ్యాక్టరీకి సంగీతం అందించిన కబీర్ రఫీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, విడుదల తేదీ త్వరలో ప్రకటించబడనుంది.

Exit mobile version