సందీప్ కిషన్ నటించిన హాకీ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’ ఈ యేడాది మార్చి మొదటి వారంలో థియేటర్లలో విడుదలైంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నిజానికి బాక్సాఫీస్ దగ్గర పెద్దంత ప్రభావం చూపించలేకపోయింది. ఆ తర్వాత మే నెలలో సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయగానే… సూపర్ రెస్పాన్స్ ను అందుకుంటోంది. కేవలం 24 గంటల్లో దీనికి 6 మిలియన్ వ్యూస్ తో పాటు 189 కె లైక్స్ కూడా లభించాయి. డెన్నీస్ జీవన్ దర్శకత్వం వహించిన ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’కు హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. అవినీతి పరుడైన రాజకీయనేత నుండి చారిత్రక విలువలున్న ఓ క్రీడా మైదానాన్ని దక్కించుకోవడానికి మాజీ హాకీ ప్లేయర్ ఏం చేశాడన్నదే ఈ చిత్ర కథ. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయాతో కలిసి సందీప్ కిషన్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం.
24 గంటలు… 6 మిలియన్ల స్పీడ్ లో ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’!
