Site icon NTV Telugu

Akhanda2 : ఒంగోలులో అఖండ సినిమా చూస్తూ పూనకంతో ఊగిపోయిన మహిళ.. వీడియో వైరల్

Akhanda 2 (2)

Akhanda 2 (2)

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీనుల లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2 : ది తాండవం. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.  సూపర్ హిట్ టాక్ తో తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సూపర్ స్టార్ట్ అందుకుంది.

Also Read : Akhanda2 : అఖండ 2కు లాజిక్కులు అక్కర్లేదు, ఓన్లీ దైవత్వం : దిల్ రాజు

మరోవైపు అఖండ 2 ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరిస్తోంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా చిన్న పిల్లల నుండి పండు ముసలివారి వరకు అఖండ 2 సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఒంగోలులోని అఖండ 2 థియేటర్ లో మరొక సంఘటన వైరల్ గా మారింది. ఒంగోలులోని ఓ థియేటర్ లో అఖండ 2 సినిమా చూస్తు ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. సినిమాలో శివుడు తాండవం ఆడే సీన్ ను చూస్తూ ఆయనకు దండం పెడుతూ పూనకంతో శివనామస్మరణ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అఖండ 2 సినిమను సనాతన ధర్మాన్ని, శివతత్వాన్ని తెలియజేసేలా రూపొందించారు బోయపాటి శ్రీను. అఘోరాగా నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించి మెప్పించాడు.

Exit mobile version