NTV Telugu Site icon

Megastar Chiranjeevi : అమిత్ షా ఇంట చిరు ఫ్యామిలీకి స్పెషల్ డిన్నర్..

Whatsapp Image 2024 05 10 At 7.09.10 Am

Whatsapp Image 2024 05 10 At 7.09.10 Am

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డు విజేతలను ప్రకటించారు. సినీ రంగం నుంచి చిరంజీవి, వైజయంతిమాల, ప్రముఖ డ్యాన్సర్ పద్మ సుబ్రమణ్యం పద్మవిభూషణ్‌ అవార్డు కు ఎంపికయ్యారు. అయితే చిరంజీవి 2006లో పద్మభూషణ్ అందుకున్నారు.తాజాగా పద్మ విభూషణ్ అవార్డు కోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు.భారతీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా పద్మ అవార్డులను మే 9 న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.సినీ రంగానికి విశేష కృషి చేసిన చిరంజీవి, వైజయంతి మాలకు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను ప్రదానం చేశారు.

అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తర్వాత మెగాస్టార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలకు కేంద్ర హోం శాఖ మంత్రి ఏర్పాటు చేసిన విందుకి చిరంజీవి తన కుటుంబసభ్యులతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ ప్రత్యేక విందులో హాజరైన వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, కుమార్తె సుస్మిత, కొడుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ మరియు కోడలు ఉపాసన కొణిదెల ఉన్నారు.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ ప్రముఖలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.