రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది.
Also Read : Chiru157 : మెగా – అనిల్ నాన్ – థియేట్రికల్ రికవరి కాస్త రిస్కే
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ స్టూడియోలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొన్నాడు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజాసాబ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఆలోచన చేస్తున్నారట. కథ పరంగా సీక్వెల్ చేసేందుకు స్కోప్ ఉండడంతో ఆ దిశగా ఆలోచిస్తున్నారట దర్శకుడు మారుతీ. అయితే ఇది కేవలం ఆలోచన మాత్రేమే అని ఇంకా డిసైడ్ అవలేదని కానీ సీక్వెల్ చేస్తే బాగుంటుందని అని ప్లాన్ చేసేందుకు డిస్కషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ ను చక చక ఫినిష్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు రిలిజ్ వాయిదా పడిన రాజాసాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. మరి రాజాసాబ్ కు అనుకున్నట్టుగా సీక్వెల్ ప్లాన్ చేస్తారో లేదా ఒక సినిమాతో సరిపెడతరో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
