Site icon NTV Telugu

8 Vasantalu : ‘8 వసంతాలు’ నుంచి హార్ట్ టచింగ్ సెకండ్ టీజర్ రిలీజ్..

8 Vasanthalu

8 Vasanthalu

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి తెరకెకిస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక స‌నిల్ కుమార్ లీడ్ రోల్‌లో న‌టిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన చిత్రయూనిట్ తాజాగా మ‌రో అప్‌డేట్‌ వదిలారు.

Also Read : kattalan: ‘కట్టలన్’ మూవీ నుంచి సునీల్ పవర్ ఫుల్ పోస్టర్..

ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రక‌టించారు మెకర్స్. ఈ సంద‌ర్భంగా కొత్త టీజ‌ర్‌ను కూడా పంచుకున్నారు. ఫ‌స్ట్ టీజ‌ర్‌లో క‌థానాయిక‌ను ప‌రిచ‌యం చేసిన టీమ్.. రెండో టీజ‌ర్‌లో హీరో పాత్రను ప‌రిచ‌యం చేసింది. మ‌ధురం అనే షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్న ర‌వి తేజ దుగ్గిరాల ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ‘ఊటీకి కొత్తగా వచ్చిన తెలుగు రచయిత అత‌డు. తను పదాలను ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పూలలా ఉంటాయి. అదే కసితో రాస్తే, పిన్‌ పీకిన గ్రనేడ్‌లా ఉంటాయి’ అంటూ మొదలైన ఈ టీజర్ ‘ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు.. చేయాల్సిన ప్రయాణం’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ తో ముగిసింది. ప్రేమ క‌విత్వంతో పొంగిపోయేలా ఉన్న ఈ టీజ‌ర్‌ను మీరు చూసేయండి.

 

Exit mobile version