రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘6 జర్నీ’ చిత్రం అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో రూపొందింది. బసీర్ ఆలూరి దర్శకత్వంలో, పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, మే 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు బసీర్ ఆలూరి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. గతంలో తెలుగులో ‘సమరం’, కన్నడలో మరో చిత్రాన్ని తీశాను. ఇప్పుడు నా మూడో చిత్రం ‘6 జర్నీ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఆరుగురి జీవిత ప్రయాణంతో రూపొందిన ఈ సినిమా, గోవా ట్రిప్‌ను ఆస్వాదించి సూసైడ్ చేసుకోవాలనుకునే ఓ బ్యాచ్ కథ. వారి ప్రయాణంలో ఎదురైన సంఘటనలు, సవాళ్లే ఈ కథాంశం.
సమీర్, పల్లవి జంట అద్భుత నటన కనబరిచింది. కొత్త నటుడు అభిరాం విలన్‌గా ఆకట్టుకున్నాడు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్‌తో సహా టీమ్ అంతా అద్భుతంగా పనిచేసింది. నిర్మాత మా ఊరి వ్యక్తి, సినిమా అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఈ కథ ఆయనను ఆకర్షించడంతో ప్రాజెక్ట్ ఆరంభమైంది.
వర్షాకాలంలో షూటింగ్ జరిగింది, ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా, ప్రకృతి సహకారంతో షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ సింహా అద్భుతమైన పాటలు, సంగీతాన్ని అందించారు. ఇప్పటికే మా పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. బలమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం అందరినీ ఆకర్షిస్తుంది. క్లైమాక్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. శ్రీరాముడు జన్మించిన భూమిపై ఉగ్రవాదుల దాడులను యువత ఎలా ఎదుర్కొంటుందనే దేశభక్తితో కూడిన సన్నివేశాలను ఉత్తేజకరంగా తీర్చిదిద్దాం. ప్రస్తుత పరిస్థితులకు సరిపోలేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం నేపథ్యంలో నడుస్తుంది. బోర్డర్‌లో షూటింగ్, వర్షాకాలం కారణంగా బడ్జెట్ కాస్త పెరిగింది. అక్టోబర్‌లో ముంబై బ్యాక్‌డ్రాప్‌లో మరో సినిమా తీయనున్నాను. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి, త్వరలో పూర్తి వివరాలు పంచుకుంటాను అని అన్నారు.
