NTV Telugu Site icon

35Movie : టాలీవుడ్ టాప్ హీరో మెచ్చిన సినిమా ’35 చిన్న కథ కాదు’: నిర్మాత సృజన్

Untitled Design (6)

Untitled Design (6)

నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న 35-చిన్న కథ కాదు”సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Also Read: Mokshagna : జూనియర్ సింహం ఎంట్రీ పై ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్..

ఈ సందర్భంగా నిర్మాత సృజన్ యరబోలు మాట్లాడుతూ ” ఓవర్సిస్ లో దాదాపు 70 సినిమాలని డిస్ట్రిబ్యూషన్ చేశాను.   మొదటి సినిమా కంచె. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వచ్చాను. ‘మను’ సినిమాతో నిర్మాతగా మారాను. నా టెన్త్ ఫిలిం ’35-చిన్న కథ కాదు’   సెప్టెంబర్ 6న  విడుదల కావడం ఆనందంగా వుంది. ఇప్పటివరకూ నేను చేసినవన్నీ కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్. మదర్ సెంటిమెంట్ కి మించిన కమర్షియల్ ఎలిమెంట్ ఏది లేదు.  కథ, స్క్రీన్ ప్లే పెర్ఫెక్ట్ గా వుంటాయి. ఓ పెద్ద హీరో ఈ సినిమా చూసి వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ థియేటర్ కి పంపించే కథ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అది నేను నమ్ముతున్నాను. సినిమా విడుదల తర్వాత టాక్ స్ప్రెడ్ అవుతుంది. వైల్డ్ ఫైర్ లా సినిమా అంతాట వ్యాపిస్తుంది. సినిమాని అందరూ వోన్ చేసుకుంటారు. ఇది థియేటర్ కోసం చేసిన సినిమా. తిరుపతి, అక్కడ ఓ ఇల్లు, స్కూల్ ఇలా ఓ బ్యూటీఫుల్ వరల్డ్ వుంటుంది. సినిమా చూస్తున్నపుడు ఆడియన్స్ కి ఆ వరల్డ్ లో వున్న ఫీలింగ్ కలుగుతుంది. నాగార్జున గారు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయనకి టీజర్, ట్రైలర్ చాలా నచ్చాయి. బిగ్ బాస్ వలన సినిమా మరింత రీచ్ వెళ్ళింది ” అని అన్నారు.

Show comments