Site icon NTV Telugu

“తగ్గేదే లే” అంటున్న సాయి పల్లవి

250 Million views for Saranga Dariya Song from Love Story Movie

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సౌత్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే. అయినప్పటికీ ఆమె అభినయానికి, డ్యాన్స్ కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో ఆమె నటించిన సాంగ్స్ కు వచ్చినంత అద్భుతమైన రెస్పాన్స్ స్టార్ హీరోల సాంగ్స్ కు సైతం రాలేదంటే అతిశయోక్తికాదు. తాజాగా సాయి పల్లవి మరో సాంగ్ రికార్డు క్రియేట్ చేసే విషయంలో “తగ్గేదే లే” అంటూ దూసుకెళ్తోంది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లవ్ స్టోరి’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఎమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి విడుదల అయిన సాంగ్స్ కు యూట్యూబ్ అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్.

Read Also : ఎస్ఆర్ కళ్యాణమండపం : “సిగ్గెందుకురా మామ” మాస్ సాంగ్

తాజాగా ఈ సాంగ్ 250 మిలియన్ వ్యూస్ దాటేసి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ లిరికల్ వీడియో సాంగ్ లిరిక్స్, మ్యూజిక్, మంగ్లీ పాడిన తీరు, సాయి పల్లవి వేసిన స్టెప్పులు… అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘సారంగ దరియా’ సాంగ్ ను రిలీజ్ అయ్యి చాలా రోజులే అవుతున్నా దాని జోరు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఇక ముందు ముందు ఈ సాంగ్ మరెన్ని వ్యూస్ ను కొల్లగొడుతుందో చూడాలి.

Exit mobile version