NTV Telugu Site icon

23 The Movie: ’23’.. అంటున్నారు ఏంటో?

23 Movie

23 Movie

మల్లేశం, 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు “23” తో రాజ్ ఆర్ వస్తున్నారు. స్టూడియో 99 నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. “23” కి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని నిర్వహించగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఈ సినిమా సున్నితమైన, ఆలోచింపజేసే సంఘటనల చిత్రీకరరించిన తీరుని చూసి చలించిపోయారు.

Servant Theft: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన పనిమనిషి

అర్థవంతమైన సంభాషణను ప్రేరేపించే సామర్థ్యాన్ని గుర్తించి, కళాత్మక నైపుణ్యాన్ని ఆయన ప్రశంసించారు. డిప్యూటీ సీఎం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ మంటల్లో చిక్కుకున్న బస్సును, మంటల్లో చిక్కుకున్న వ్యక్తులను, ప్రాణాల కోసం పరిగెత్తుతున్న వారితో కనిపిస్తోంది. జార్జ్ ఆర్వెల్ రాసిన ప్రసిద్ధ కోట్ “All are equal, but some are more equal than others,” paired with the movie’s tagline”అనే సినిమా ట్యాగ్‌లైన్‌ కూడా ఉంచడం ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తోంది. “మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా..?” అనే కొటేషన్ ఇంకా ఆలోచింప చేసేది ఉంది. నిర్మాతలు త్వరలో సినిమా థియేటర్ విడుదల తేదీని అనౌన్స్ చేస్తారు.